Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు ఆర్డిఓ

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు ఆర్డిఓ

- Advertisement -

మీ కోసం కార్యక్రమంలో డివి జన్ స్థాయి అధికారులు తప్ప నిసరిగా హాజరయ్యి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్క రించాలి

కొవ్వూరు ఆర్డీవో — రాణి సుస్మిత.

విశాలాంధ్ర -కొవ్వూరు :మీ కోసం కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కొవ్వూ రు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాల యంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీల ను ఆర్డీవో స్వీకరించారు. ఈ సందర్భంగా రాణి సుస్మిత మా ట్లాడుతూ 13 మీకోసం పిజిఆర్ఎస్ ద్వారా అర్జీలు వచ్చాయని తెలి పారు. వారంలో రెండు రోజులు ఆయా ప్రభుత్వ శాఖలకు సంబం ధించి జి ల్లా అధికారి, డివిజన్ అధి కారులతో సమావేశం నిర్వహించి అర్జీలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మీ కోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి, వారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుం టామని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “1100 – మీకోసం కాల్ సెం టర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు మరియు నమోదైన మీ అర్జీ యొక్క యదార్ధ స్థితిగతులు తెలుసుకో వచ్చునని తెలిపారు. మీకోసం లో వచ్చిన అర్జీలు :- కొవ్వూరు మండలం, పసివే దల గ్రామానికి చెందిన గనిరెడ్డి లక్ష్మి, మా పొలంలో పంచాయ తీ సిబ్బంది చెత్తను మా పొలా నికి దగ్గరగా డంపింగ్ చేస్తు న్నారు. దానివల్ల మా పొలానికి నష్టం వాటిల్లుతోందని, చెత్తను డబ్బింగ్ చేయకుండా చూడా లని అర్జీ సమర్పించుకున్నారు. నల్లజర్ల గ్రామానికి చెందిన గోపర్తి నారాయణమూర్తి, నా స్థలాన్ని ఆక్రమించుకుని ప్రహరీ కూడా నిర్మిస్తున్నారని, నిర్మాణం ఆపే విధంగా చూడా లని దరఖాస్తు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ ల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు