Sunday, March 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅలరించిన మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన.. గురువు మానస

అలరించిన మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన.. గురువు మానస

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; అరుణాచలం దేవస్థానం వేదిక యందు అరుణాచలేశ్వరునికి నృత్య నీరాజనం అనే కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళా కేంద్రం వారు ప్రదర్శించిన నృత్యం అందరిని ఆకట్టుకున్నదని గురువు మానస తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మొత్తం 200 మంది చిన్నారులు పాల్గొనడం జరిగిందని, అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి నృత్య కళాకారులు గురువులు విచ్చేయడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ముఖ్య అతిథులుగా రంగస్థలం సకలవృత్తి కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్ది పోగు ఆనందు విచ్చేసి గురువులు అందరికీ దేవస్థానం శాఖ వారి చేతులు మీదుగా నాట్యరత్న 2025 పురస్కారంతో సత్కరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులు అందరికీ కూడా నాట్య మయూరి 2025 అవార్డు కూడా అందజేశారని తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని స్వామివారి సన్నిధిలో నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తదుపరి అరుణాచలం దేవస్థానం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు