Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు పట్ల హర్షం…

మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు పట్ల హర్షం…

- Advertisement -

ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం రాయలసీమ జోన్ కన్వీనర్ పోలా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : హ్యాండ్లూమ్ కస్టర్ మంజూరు పట్ల ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం రాయలసీమ జోన్ కన్వీనర్ పోలా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నకు 35 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయ తలపెట్టిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కు ఇటీవల ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం శుభదాయకమన్నారు. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో 9.80 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వేలాదిమంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేసినకూటమి ప్రభుత్వమునకు చేనేత కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అదే విధంగా చేనేతలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలైన నేతన్న భరోసా,200 యూనిట్ల ఉచిత విద్యుత్,జిఎస్టి రియంబర్స్మెంట్ ,చేనేతలకు పక్కా ఇల్లు తదితర హామీలను వెంటనే నెరవేర్చి చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేతలు చంద్రమౌళి,ఆంజనేయులు,బాల నారాయణ ,రఫీ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు