Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరేగాటిపల్లి రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొలగించండి

రేగాటిపల్లి రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొలగించండి

- Advertisement -

ప్రజల ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వద్ద గల రైల్వే గేటు వద్ద ఇటీవల రైల్వే పట్టాల నూతన నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత, రైల్వే కాంట్రాక్టర్లు పట్టణానికి ఇటువైపు అటువైపు వెళ్లే రహదారులకు అతి ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను వేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల ఎంతోమంది టూ వీలర్లు, బాటసారిలు ఆ ఎత్తును గమనించలేక పోవడం వల్ల క్రిందకు పడడం, ప్రమాదాలు చోటు చేసుకుంటున్న అని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా అతి ఎత్తైన స్పీడ్ బ్రేకర్ ఉండటం వలన కారు లుకూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, కారుకు ముఖ్యమైన భాగంలో ఆ స్పీడ్ బ్రేకర్లు తగులుతున్నాయని వాహనదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ మెన్ ఉద్యోగులకు సమస్య తెలిపిన కూడా, వారి నుంచి స్పందన రావడంలేదని వాపోయారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు ఆ కాంట్రాక్టు ద్వారా ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తగ్గించే ఏర్పాట్లను, లేదా తొలగించే ఏర్పాట్లను చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు