నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో జనవరి నెల (2026) 18వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటలకు సస్టాంకములు అనే ఉచిత నాటకమును ప్రదర్శిస్తున్నట్లు శ్రీ మారుతి నాట్యమండలి నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈ నాటకాన్ని ప్రదర్శించునట్లు వారు తెలిపారు. నాటకములలో శ్రీ రామాంజనేయ యుద్ధం ,భక్త చింతామణి, గయోపాఖ్యానం, సత్య హరిచంద్ర అను నాటకములు ప్రదర్శించబడునని తెలిపారు. అదేవిధంగా ఈ నాటకము ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నాటకంలో హార్మోనియంను ఏ.ఆర్. రామాంజనేయులు, తబలా శ్రీధర్, క్లారినెట్ రమేష్. కళ్యాణదుర్గం వారు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. కావున ఈ నాటకమును విజయవంతము చేయుటలో పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలందరూ కూడా ఆహ్వానితులేనని వారు తెలిపారు.
జనవరి 18న షష్ఠంకములు ఉచిత నాటకములు జయప్రదం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


