Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరుపుకున్న జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు

ఘనంగా జరుపుకున్న జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పాత్రికేయులందరూ ఆదివారం రోజు జాతీయ పత్రిక దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులతో తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ పత్రిక లేనిదే సమాజము, రాష్ట్రము, దేశము అభివృద్ధి కాదు అని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లతో పరిష్కార దిశగా ప్రయత్నించడంలో మీడియా సేవలు ఇప్పటికే కీలకపాత్ర వహించాయి అని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకాలను ప్రజల వద్దకు దరి తీర్చేంతవరకు కృషి చేస్తారని, పథకాలు అందకుండా దొంగ మార్గాన వెళ్లే వాటి వివరాలను కూడా అధికారులకు, అధికార పార్టీ ప్రతినిధులకు, ఇతర పార్టీ ప్రతినిధులకు తెలిపి బాధితులకు సహాయం అందించే వారే పత్రికా విలేకరులు అని తెలిపారు. నీతి, నిజాయితీలతో జర్నలిజం విలువలను కాపాడే ప్రతి మీడియా సోదరులు కూడా నేడు ఈ జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా, సమన్వయం చేస్తూ, మంచి, చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సును కోరుకునే వారే పాత్రికేయులు అని తెలిపారు. నిజాన్ని నిర్భయంగా ప్రజా గళాన్ని తమ కలముతో నేడు పాత్రికేయ మిత్రులు వినిపించడం, న్యాయానికి చిహ్నమని తెలిపారు. సమాజ శ్రేయస్సు కొరకై అక్షర జ్ఞానం ఆయుధమై ,వార్తను చేరవేస్తూ, ప్రజల పట్ల ధైర్యాన్ని, విషయపరిజ్ఞానాన్ని కలిగిస్తూ, నిత్యం ప్రజల అభిమానం కోసం, పత్రిక స్వేచ్ఛ కోసం ,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పాటుపడే వారే పాత్రికేయులు అని తెలిపారు. ఇందులో భాగంగానే వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా పాత్రికేయులకు శుభాకాంక్షలు అని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు