Homeఆంధ్రప్రదేశ్ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన

- Advertisement -


-వైద్య తనిఖీలు నిర్వహించిన స్పందన ఆసుపత్రి వైద్యులు


విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ ,పార్థసారధి నగర్, సాయిబాబా గుడి దగ్గర గల స్పందన హాస్పిటల్ లో గర్భకోశ వ్యాధులు జనరల్ మెడిసిన్ ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భకోశ వ్యాధులు తో బాధపడుతున్న వారందరికీ కూడా పరీక్షించి మందులు వైద్య సలహాలతో పాటు అవసరమైన వారికి స్కానింగ్ కూడా ఉచితంగా చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ డాక్టర్ ఘంటసాల రాఘవేంద్ర చే ప్రజలకు వచ్చు వివిధ రోగాలు, బీపీ షుగర్, ఊపిరితిత్తుల సమస్య, లివర్ జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులు తదితర వాటికి వైద్య చికిత్సలతో పాటు అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 132 మంది రోగులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్, సిస్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు