మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం; ప్రజలకు మున్సిపాలిటీల పట్ల మంచి నమ్మకాన్ని ఉద్యోగస్తులు కల్పించినప్పుడే పురపాలక సంఘం అభివృద్ధి బాటలో నడుస్తుందని పురపాలక సంఘ కార్యాలయ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, కౌన్సిలర్లు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు ఒంటిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. పట్టణంలో సుజీ శుభ్రత, రెవెన్యూ వసూలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగస్తులు ప్రజలకు నమ్మకాన్ని కల్పించాలి
- Advertisement -
RELATED ARTICLES


