Friday, March 6, 2026
Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుఘనంగా పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మండల కేంద్రం డుంబ్రిగూడ మండల పరిషత్ పాఠశాల ఆవరణలో పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్టియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ప్రధానంగా అప్రెంటిస్ విధానం రద్దు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు కొరకు కృషిచేసి సాధించడం జరిగిందన్నారు. పిఆర్టియు సంఘం 1971 ఫిబ్రవరి 9వ తేదీన ఏర్పాటు అయిందన్నారు. దీంతో 55 సంవత్సరాలు పూర్తిగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ఉపాధ్యాయులకు 30% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, పిఆర్సి తక్షణమే ఏర్పాటు చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని,టి ఆర్ టి యు అల్లూరి జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్న మన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, మహిళ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు