Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిరుద్యోగ యువతకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:
నిరుద్యోగ యువతకు మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫిబ్రవరి 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. యువతకు నైపుణ్యాధారిత ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఈఎంఎం వి డబ్ల్యూ ఈ గ్రూప్, అపోలో ఫార్మసీలు, కోటక్ మహీంద్రా బ్యాంక్ (మైక్రోఫైనాన్స్), బిగ్ బాస్కెట్, టాటా ఎలక్ట్రానిక్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ప్రీమియర్ ఎనర్జీస్, డిక్సన్ ఎస్వీఎస్ సర్వీసెస్, కాన్సెంట్రిక్స్ స్టాఫింగ్ సొల్యూషన్స్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటాయన్నారు.. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీయూసీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రొడక్షన్, క్వాలిటీ, అసోసియేట్, టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, కస్టమర్ సపోర్ట్, స్టోర్ ఎగ్జిక్యూటివ్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వాళ్ళు ఉద్యోగాలు బెంగళూరు, హైదరాబాద్, పెనుకొండ, కడప, నాయుడుపేట, అనంతపురం తదితర ప్రాంతాల్లో చేయాలన్నారు. నెలకు సుమారు రూ.12,000 నుండి రూ.25,000 వరకు వేతనం, కొన్ని కంపెనీల్లో ఆహారం, వసతి, రవాణా సదుపాయాలు, ప్రోత్సాహకాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు ముందస్తుగా వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధృవపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 91822 88465 నంబర్‌ను సంప్రదించాలని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు