విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఉరవకొండ పట్టణానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ప్యారం కేశవానంద నియమితులయ్యారు. ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం త్రీ మెన్ కమిటీని నియమించింది. చైర్మన్ తో పాటు డైరెక్టర్లుగా నిమ్మగల్లు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శివకుమార్ (పుట్టప్ప) భార్య నాగ ప్రమీల, ఉరవకొండ పట్టణానికి చెందిన నాగేంద్రప్ప ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చైర్మన్గా నియమితులైన ప్యారం కేశవానంద మాట్లాడుతూ సహకార సంఘం, మరియు రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను చైర్మన్గా నియమించేందుకు కృషిచేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు, మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్గా నియమితులైన ప్యారం కేశవానందను మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


