విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : నేత్రదానం మహాదానం అని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ అన్నారు. అమ్మవారి కాలనీ 7వ వీధికి చెందిన రవ్వ అమ్మడమ్మ 85 సంవత్సరాలు సాధారణ మరణం చెందారు. కుటుంబ సభ్యులు మరియు కుమార్తె యస్ ఉమాకుమారి రవ్వ అమ్మడమ్మ నేత్రాలను దానం చేయాలని, రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య లకు సమాచారం అందించారు. విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కళ్యాన్ నేత్రధాన సిబ్బంది సుమతి సుజాత తదితరులు వచ్చి రవ్వ అమ్మడమ్మ నుండి కార్నియాలను సేకరించారు. కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ మరియు పెంకి చైతన్య కుమార్ అమ్మవారి కాలనీవాసులకు నేత్రదానం ఆవశ్యకతను తెలియచేశారు. రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య కుమార్ పిడుగు సూర్యారావు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పనికి వారిని అభినందించారు.


