Homeజిల్లాలుఅనంతపురంసమతుల్య ఆహారంతో .. సంపూర్ణ ఆరోగ్యం

సమతుల్య ఆహారంతో .. సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సమతుల్య ఆహారంతో .. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఎస్ వి డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి, ప్రిన్సిపల్ డా . ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కళాశాలలో ఆహార సముతుల్యం, ఆరోగ్య జీవన విధానంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పివి కె కె పీజీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. ఆహారంలో ప్రకృతితో ముడిపడి ఉన్న పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, తృణధాన్యాలు, తేలికపాటి మాంసకృతులు తీసుకోవాలని సూచించారు. జీవన విధానంలో వ్యాయామం , ఆహార నియమాలు జీవన ప్రమాణాల మెరుగుకు తోడ్పాటును అందిస్తుంది అన్నారు. ఈ సెమినార్ లో తొలి బహుమతిని పీజీ కళాశాల వృక్షశాస్త్ర విద్యార్థులు శ్రీలక్ష్మి, తేజస్విని, ఎన్ .సరిత, కుమారి బృందం ప్రజెంటేషన్లో నమూనాలను కళాశాల అధ్యాపకురాలు నీలు పర్యవేక్షణలో సంకృప్తంగా వివరించారు. కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులను పి వి కె కెపీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మునికృష్ణారెడ్డి అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఆరోగ్య జీవన రుగ్మతల రక్షణకు అత్యధిక ఖర్చులు చేస్తూ.. ఆరోగ్య జీవన ప్రమాణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు