విశాలాంధ్ర- అనంతపురం : అనస్తీసియా విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యం లో
వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ,ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరిండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం లు గురువారం ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆధునిక శస్త్ర చికిత్సలలో అనస్థీషియా నొప్పిని నివారించడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తుంది, అనస్తీషియా వైద్యుల సేవలు అభినందనీయం అని పేర్కొన్నారు. అక్టోబర్ 16,1846వ సం బోస్టన్ లోని మసాచు సెట్స్ ఆసుపత్రిలో ఈతర్ అనే రసాయన పదార్థాన్ని శస్త్ర చికిత్స సమయంలో నొప్పిని నివారిం చడానికి ఉపయోగించవచ్చని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు అని పేర్కొన్నారు. అత్యాధునిక శస్త్ర చికిత్స లు కూడా ఎటువంటి మరణాలు సంభవించకుండా విజయవంతంగా చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనస్తీసియా విభాగానికి హెచ్వోడి నవీన్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ టి. మధుసూదన్, డాక్టర్ జి.శ్రీహరి బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ పద్మా బాయ్, గంగాధర్ రెడ్డి,ఎదు భూషణ్, వేమన నాయక్, సోమశేఖర్, హరికృష్ణ, జ్యోత్స్న,ఆది లక్ష్మి, తులసి, శేలియా డేని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లలిత భవాని, డాక్టర్ సుమన గోపీచంద్ పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలో ప్రపంచ అనస్తీసియా దినోత్సవం వేడుకలు
- Advertisement -


