Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడ్రిప్పు , స్ప్రింకర్స్ కు రిజిస్ట్రేషన్ రైతులు చేసుకోండి..

డ్రిప్పు , స్ప్రింకర్స్ కు రిజిస్ట్రేషన్ రైతులు చేసుకోండి..

డివిజన్ ఎమ్ఐఏవో ..జే..శివశంకర్
విశాలాంధ్ర ధర్మవరం::2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ.పీ.ఎం.ఐ.పి ప్రాజెక్ట్ షురూ కావడం జరిగిందని,ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ గుంటూరు
వారి ఆదేశాలు ప్రకార ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా డ్రిప్పు ,స్ప్రింక్లర్స్ నియోజకవర్గంలోని రైతులకు కావలసినవారు మే 27వ తేదీ నుండి రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వచ్చును అని డివిజన్ ఎంఐఏఓ. జే శివశంకర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డ్రిప్పు, స్ప్రింక్లర్స్ కావలసినవారు 1-బి,,ఎఫ్.ఎం.బి. స్కెచ్, పొలం చెక్కుబంది సర్టిఫికెట్,ఆధార్ కార్డు జిరాక్స్,బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, కరెంట్ బిల్లు. యస్.సి,యస్.టి, రైతులు అయితే కులం సర్టిఫికెట్, అందజేయాలని తెలిపారు.ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీ రైతులకు పట్టాదారు పాసు పుస్తకము నందు 5 ఎకరముల వరకు 100 శాతము సబ్సిడీ, ఐదు ఎకరముల పైన పది ఎకరముల గల ఎస్సీ ఎస్టీ రైతులకు 90 శాతముసబ్సిడీ ప్రకారం, బి.సి , ఓ.సి రైతులకు 10 ఎకరముల వరకు 90 శాతము సబ్సిడీ ,10 ఎకరముల పైన ఉన్న రైతులకు 50 శాతముసబ్సిడీ సబ్సిడీ, ప్రకారంగాను,
స్ప్రింక్లర్స్ కాసిన రైతులు అన్ని కులాల వారికి 50 శాతము సబ్సిడీతో, పంపిణీ చేయబడును అని తెలిపారు. ఈ అవకాశమును నియోజకవర్గంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్…7995010080కు సంప్రదించగలరని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు