డిఆర్ఓ మలోలకు ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.సంతోష్ కుమార్ వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ అనంతపురం ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డి.రో.వో. మలోలా కు ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ కుమార్ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ,పంపిణీ , సరఫరా సంస్థలలో దాదాపు పదివేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పై పని భారం పడుతున్నది పనిభారం తో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టభద్రులై నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయటం వలన ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు పని భారం తగ్గించడంతో పాటు ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కావున విద్యుత్ శాఖలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. జెన్ కో లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ _ 379 , జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ _ 1761, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ _ 33, జూనియర్ అసిస్టెంట్ 110 వీటితో పాటు సబ్ ఇంజనీర్ , ఆఫీస్ సబార్డినేటర్ కలిపి దాదాపు 2500 పై చిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ట్రాన్స్ కో లో అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 498, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ _ 47 , జూనియర్ అసిస్టెంట్ 114, జూనియర్ లైన్ మెన్_ 1019, అసిస్టెంట్ 41, ఆఫీస్ సబార్డినేటర్/ ఆఫీస్ అసిస్టంట్ 187 ఇతర ఉద్యోగాలు కలిపి 2000పై చిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఎస్ పి డి సి ఎల్ లోఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 181, జూనియర్ అకౌంటు ఆఫీసర్ _67, జూనియర్ అసిస్టెంట్ _739 , జూనియర్ లైన్‌మ్యాన్ _1846 , జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 _182 వీటితో పాటు షిఫ్ట్ ఆపరేటర్ లు కలిపి 3500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. సీపీడీసీల్ లో అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 87, అసిస్టంట్4, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ 352, జూనియర్ లైన్మెన్ _ 1136 , ఆఫీస్ సబార్డినేటర్/ ఆఫీస్ అసిస్టంట్ _ 13. వీటితో పాటు షిఫ్ట్ ఆపరేటర్ లు కలిపి 2000పై చిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
ఏపీడీసీలో అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్_ 158, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ _ 55 , జూనియర్ అసిస్టెంట్ 592, జూనియర్ లైన్ మెన్_ 1517, ఆఫీస్ సబార్డినేటర్/ ఆఫీస్ అసిస్టంట్ _ 40 వీటితో పాటు షిప్ట్ ఆపరేటర్ లు కలిపి 2500పై చిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ , సరఫరా సంస్థలలో పైన తెలిపిన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న ప్రాధమిక సమాచారం ఉందన్నారు. వాటిని భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్. జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ నాయకులు శ్రీనాథ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.