Homeజాతీయంహంపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

హంపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

- Advertisement -

కర్ణాటకలో హుబ్బళ్లి నుంచి మైసూరుకు వెళ్తున్న హంపీ రైలులో భయానక ఘటన చోటుచేసుకుంది.
బుధవారం రాత్రి బయలుదేరిన ఈ రైలు బళ్లారి తాలూకా హగరి రైల్వే నిలయం సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా బ్రేకులు బలంగా పట్టేయడంతో చక్రాలు,పట్టాల మధ్య తీవ్ర రాపిడి ఏర్పడింది.
ఈ రాపిడితో చక్రాల దగ్గర మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును ఆపివేశారు.
ఈ సమయంలో బోగీల్లోకి పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలను అదుపులోకి తెచ్చిన రైలు కోపైలట్, సిబ్బంది
పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందేమోనని ఆందోళన చెందిన వారు రైలు దిగి దూరంగా పరుగులు తీశారు. వెంటనే స్పందించిన రైలు కోపైలట్, సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి ఆర్పివేశారు.
దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సిబ్బంది బ్రేకులను సరిచేసి రైలును తిరిగి ప్రయాణానికి సిద్ధం చేశారు. ఈ ఘటన కారణంగా రైలు సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.అలాగే బళ్లారికి చెందిన కొంతమంది ప్రయాణికులు హగరి నుంచే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు