Thursday, December 12, 2024
Homeమణికొండలో అగ్నిప్రమాదం ..9వ అంతస్తు నుంచి ఎగసిపడిన మంటలు

మణికొండలో అగ్నిప్రమాదం ..9వ అంతస్తు నుంచి ఎగసిపడిన మంటలు

హైదరాబాద్ శివారు మణికొండ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. పుప్పాలగూడలోని ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో ఫ్లోర్‌లో గల ఒక ప్లాట్‌లో మూడు రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. ఆ సందర్భంగా ఫ్లాట్‌లో వెలిగించిన దీపం బుధవారం కిందపడటంతో మంటలు అంటుకున్నాయని సమాచారం. ఆపార్ట్‌మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు