Thursday, December 12, 2024
Homeఅంతర్జాతీయంఫ్రాన్స్‌లో సామూహిక అత్యాచార ఘటన.. ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ వద్ద వేలాదిమంది మహిళల టాప్‌లెస్ నిరసన!

ఫ్రాన్స్‌లో సామూహిక అత్యాచార ఘటన.. ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ వద్ద వేలాదిమంది మహిళల టాప్‌లెస్ నిరసన!

లైంగిక హింస, అసమానతలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలాదిమంది మహిళలు, పురుషులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ ముందు మహిళలు టాప్‌లెస్‌గా ప్రదర్శన నిర్వహించారు. లైంగిక దాడులు, అసమానతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక నేరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పునరుత్పత్తి హక్కులను రక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ామహిళలపై యుద్ధాలు ఆపండి్ణ, ామహిళలకు జీవన స్వేచ్ఛ కల్పించండి్ణ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళల నిరసన ప్రదర్శనను పోలీసులు నిశ్శబ్దంగా తిలకించారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గిసెల్ పెలికాట్ అనే మహిళపై ఆమె మాజీ భర్త సహా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. లైంగిక హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. కాగా, మహిళలకు మద్దతుగా పురుషులు కూడా ఈ నిరసన ప్రదర్శనల్లో పాలు పంచుకున్నారు. లైంగిక ఆధారిత హింసపై సమష్టిగా పోరాడాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు