విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక జిల్లా అధికారి, స్థానిక ధర్మవరం ఫైర్ ఆఫీసర్ నరసింహులు ఆదేశాల మేరకు ఘనంగా ప్రారంభమయ్యాయి.తొలుత అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కూడా కమిషనర్ తో పాటు సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. తదుపరి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవికాలంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఆఫీసుకు సమాచారాన్ని అందిస్తే తగిన న్యాయం, రక్షణ కలుగుతుందన్నారు. అగ్నిమాపక సేవలు గూర్చి వివరించారు. తదుపరి వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఏడు రోజులు పాటు పట్టణంలోని బలుచోట్ల వారోత్సవాల యొక్క అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. అగ్ని ప్రమాదాలపై కూడా అవగాహన సదస్సును నిర్వహిస్తూ నివారణ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు
- Advertisement -
RELATED ARTICLES


