- Advertisement -
తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది.ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది.కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి మంగళవారం తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వివరించింది.


