Homeక్రీడలుజట్టు నుంచి తప్పించడం సరైనదే .. సంజు శాంసన్‌ కీలక వ్యాఖ్యలు

జట్టు నుంచి తప్పించడం సరైనదే .. సంజు శాంసన్‌ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

సంజు శాంసన్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధశతకం సాధించి, తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.
అయితే, తాను సరిగ్గా ఆడనప్పుడు జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయమేనని సంజు అభిప్రాయపడ్డాడు. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించాడు. 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, బయట నుంచి వినిపించే ప్రతి మాట తనపై ప్రభావం చూపుతుందని అంగీకరించాడు.

కొన్ని వైఫల్యాల తర్వాత విమర్శలు రావడం సహజమే:సంజు
ఃఃకొన్ని వైఫల్యాల తర్వాత విమర్శలు రావడం సహజమే. భారత క్రికెటర్‌గా వైఫల్యాలను ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయితే, అలాంటి సమయాల్లో నా అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. బయట నుంచి వచ్చే విమర్శలను వీలైనంత వరకు పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తా. ప్రతి మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతా. విఫలమైతే మళ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా.. రిస్క్ తీసుకుని ఆడతాఃః అని సంజు శాంసన్‌ తెలిపాడు.

నేనూ సారథిగా..
ఃఃజట్టు సారథిగా ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటో నాకూ తెలుసు. ఐపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించా. నా నియంత్రణలో ఉన్న అంశాలపై ఎలా దృష్టి పెట్టాలో నాకు తెలుసు. దేశం కోసం, జట్టు కోసం ఆడుతున్నప్పుడు మ్యాచ్‌ గెలవడమే మా అందరి లక్ష్యం. వ్యక్తిగత విషయాలు ఆ తర్వాతేఃః అని సంజు స్పష్టం చేశాడు.

ఆ విషయంలో గంభీర్‌..
ఓ 15 ఏళ్ల కుర్రాడు (వైభవ్‌ సూర్యవంశీ) భారీగా పరుగులు చేసి సిద్ధంగా ఉన్నాడు.అంతకుముందు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నేను నిలిచా. కానీ, ఆ తర్వాత ఆ యువ సంచలనం అద్భుతంగా ఆడాడు. అదే సమయంలో నేను రెండు మ్యాచ్‌ల్లో సరిగ్గా రాణించలేదు. అతడిని ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. కెప్టెన్సీ కోణంలో ఆలోచిస్తే అది సరైన నిర్ణయమే. ఐపీఎల్‌లోనూ ఇలాంటి సందర్భాలు ఎన్నో చూశా. జట్టు నుంచి తప్పించాలనుకునే ఆటగాడికి విషయాన్ని సరిగ్గా వివరించడం ముఖ్యం. ఆ విషయంలో గంభీర్‌ నాతో సుదీర్ఘంగా మాట్లాడాడు అని సంజు వ్యాఖ్యానించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు