Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు

ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు

- Advertisement -

సీతా రామాంజనేయ ఆలయ చెలిమి జీర్ణోదరణ సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని చెరిమిరోడ్ లో శ్రీ సీతారామాంజనేయ స్వామి సన్నిధిలో ధ్వజస్తంభము, విద్యా గణాపతి విముఖ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఈనెల 18వ 19వ 20వ తేదీలలో అంగరంగ వైభవంగా కార్యక్రమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ చెరిమి జీర్ణోదరణ సంఘము, మహిళా మండలి వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన రక్షాబంధన, కలశ స్థాపన, 19వ తేదీన మూలవిరాట్కు పంచామృతాభిషేకం వివిధ హోమాలు, 20వ తేదీన ప్రాణ ప్రతిష్ట, చేశా హోమాలు పూర్ణాహుతి, తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు అర్చకులు చంద్రమౌళి స్వామి, మోహన స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడునని తెలిపారు. కావున ఈ వేడుకలకు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు