Homeజిల్లాలుతూర్పు గోదావరికపిలేశ్వరపురం మాజీ ఎంపిపి రాంబాబు ఆకస్మిక మృతి

కపిలేశ్వరపురం మాజీ ఎంపిపి రాంబాబు ఆకస్మిక మృతి

- Advertisement -

పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

మండపేట: కపిలేశ్వరపురం మండల మాజీ ఎంపిపి కాదా వెంకట రాంబాబు ఆకస్మిక మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం రాంబాబు గుండె పోటుతో మరణించారు. ఎమ్మెల్యే రాంబాబు పార్ధివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండల టీడీపీ అధ్యక్షులు బలవరెడ్డి సత్తిబాబు, సర్పంచ్ సాక శ్రీనివాస్, పుత్సల శ్రీనివాస్, నామాల బొజ్జియ్య తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు