Homeజిల్లాలువిజయనగరంనేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

- Advertisement -

విశాలాంధ్ర,-సంతకవిటి ( విజయనగరం జిల్లా) : సంతకవిటి మండలం సురవరం గ్రామంలోని అన్నమ్మతల్లి కళ్యాణ మండపంలో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొని మాట్లాడారు.
చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లా అప్పలనాయుడు, గట్టి భాను, గురవాణ నారాయణరావు, సుమల వెంకట మన్మధరావు, కిమిడి అశోక్ కుమార్, పిన్నింటి మోహన్ రావు, దుప్పలపూడి శ్రీను, వల్లూరి గణేష్, గట్టి రఘు, సమతం శ్రీను, మహేష్, మొయ్యి నారాయణ, దూబ ధర్మారావు, లచ్చుభుక్త కృష్ణమూర్తి, రావు రవీంద్ర, వావిలపల్లి శ్రీను, యు.పీ.రాజు, రామచంద్రుడు, బానిశెట్టి వెంకటరమణ, తూతిక చిట్టి, కె.సూర్యారావు, డి.వెంకటరమణ, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు