యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహించే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా స్వాతి క్లినిక్ లో శిబిరమునకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా శీలం సావిత్రమ్మ, శీలం శ్రీరాములు, వారి కుమారుడు శీలం జయప్రకాష్ ,కోడలు శీలం రమ్య నాగిని, వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ పేద ప్రజలు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9440248192…
ఫిబ్రవరి 1న ఉచిత కంటి వైద్య శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


