విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం రామన్నపాలెం లో శుక్రవారం నాడు ఆమెన్ ట్రస్ట్ ఏలూరు శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు ఆమెన్ ట్రస్ట్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ పౌష్టిక ఆహారం కూరగాయలు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు ఆనంద్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం ద్వారా ఈ మధ్యకాలంలో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ చక్రవర్తి పాస్టర్ మంచిది వెంకట్రావు టీ మోతి గ్రామ పెద్దలు పరిమి శ్రీరామకృష్ణ ముమ్మారెడ్డి సత్యనారాయణ కాట్రగడ్డ మోహన్ కాట్రగడ్డ వెంకటేష్ ఉండవెల్లి దుర్గారావు మిరియాల చిన్న వెంకటరావు తదితరులు పాల్గొన్నారు
ఉచిత కంటి వైద్య శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


