Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల

బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల

- Advertisement -

విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యం 

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 

విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలతో ముందుగు సాగుతుంది అని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం  నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం సీతానగరం మండలం రఘుదేవపురం పీఎం శ్రీ పాఠశాల నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే  బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. దీనిలో భాగంగా విద్యార్థుల ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించడంతో పాటు విద్యార్దులకు క్రీడా సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి 83 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెస్తుందని అని అన్నారు. అందులో భాగంగా నిర్వహించిన  మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే లక్ష్యంతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం నెలకొల్పడానికి మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని చాలా ఉపయోగకరం అని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు కామరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్యామల దేవి, సర్పంచ్ చంద్రలీల, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు