Tuesday, December 10, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅయ్యప్ప స్వామి భక్తులకు ఉచితంగా అన్నదానం.. గురు స్వామి విజయకుమార్

అయ్యప్ప స్వామి భక్తులకు ఉచితంగా అన్నదానం.. గురు స్వామి విజయకుమార్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట మార్గంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరంలో అయ్యప్ప మాల ధారణ భక్తాదులకు ఈనెల 22వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజన పంపిణీని నిర్వహిస్తున్నట్లు గురుస్వామి విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు బోధన పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయ్యప్ప మాల ధారణ వేసిన ప్రతి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు