విశాలాంధ్ర/రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం–చీపురుపల్లి రోడ్డులో గల గాయత్రి కాలనీ శ్రీ వేదమాత గాయత్రి ఆలయ ప్రాంగణంలో గాయత్రి యాత్ర మహోత్సవాల సందర్భంగా శుక్రవారం (తేది 6-2-2026) శ్రీకాకుళం మెడికవర్ సూపర్ స్పెషల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో గాయత్రి కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు వందమంది ప్రజలు పాల్గొన్నారు. వైద్యులు పాల్గొన్న వారికి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆలయ యాత్ర మహోత్సవాల సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా నిర్వహించాలని వారు కోరారు.
గాయత్రి యాత్ర మహోత్సవాల్లో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


