Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంగన్వాడీ కేంద్రాలు రెండు మూడు ఒకే చోట నుండి తొలగించాలి

అంగన్వాడీ కేంద్రాలు రెండు మూడు ఒకే చోట నుండి తొలగించాలి

- Advertisement -

పాత పద్ధతి లో యధావిధిగా కొనసాగించాలి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు

విశాలాంధ్ర ధర్మవరం;; అంగన్వాడికి కేంద్రాలు రెండు, మూడు ఒకే చోట నుండి వెంటనే తొలగించి పాత పద్ధతిలో కొనసాగించాలని కోరుతూ సిడిపిఓ జయంతికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎర్రం శెట్టి రమణ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూధర్మవరం పట్టణం తోపాటు రూరల్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను రెండు, మూడు కలిపి ఒకే చోట పెట్టడం ద్వారా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారు అని. తద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించాల్సిన పౌష్టికాహారం దూరమయ్యే ప్రమాదం ఉన్నది అని తెలిపారు. కనుక వెంటనే రెండు మూడు కేంద్రాలు గా ఉన్న వాటిని తొలగించి, ఇంతకుముందు ఏ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను అక్కడే యధావిధిగా కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు