సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత మెగా వైద్య శిబిరములు పేద ప్రజలకు వరం లాగా మారుతాయని, ఇటువంటి సమయాలలో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునే అవకాశం ఉంది అని సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల ధర్మవరం సయ్యద్ మహమ్మద్ షా ఖాదర్ వలీ రహమతుల్లా అలై దర్గాలో ఉచిత మెగా వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం సాంస్కృతిక మండలి, ఇన్నర్ వీల్ క్లబ్, దర్గా కమిటీ, పట్టణములోని గడ్డి కోట హాస్పిటల్ వారి సహాయ సహకారములతో నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో 102 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు
ఈ శిబిరంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ దివ్య దుర్గ, డాక్టర్ విక్రాంత్, డాక్టర్ ఉదయ్ కిరణ్ లచే వివిధ రోగాలకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా రోగులకు వివరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఉచిత వైద్య చికిత్సలతో పాటు వారికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి క్యాంపు చైర్మన్గా రమేష్ బాబు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. అనంతరం వైద్యులను సాంస్కృతిక మండలి, ఇన్నర్ వీల్ క్లబ్, దర్గా కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి డైరెక్టర్ అశ్వత్ నారాయణ, ఇన్నర్ వీల్ క్లబ్ రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, దర్గా కమిటీ వెల్దుర్తి బాబా, ముక్తియార్, మహబూబ్ అలీ, మహమ్మద్ ఖాద్రి, తాహిర్, సయ్యద్ హుస్సేన్, నమాజ్ ఖాద్రి, రోషన్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత మెగా వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరంలాగా మారుతాయి..
- Advertisement -
RELATED ARTICLES


