Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి ఆదివారం ఉచిత యోగా శిక్షణ.. వై ఐ సి యోగా ఇన్స్ట్రక్చర్

ప్రతి ఆదివారం ఉచిత యోగా శిక్షణ.. వై ఐ సి యోగా ఇన్స్ట్రక్చర్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని జడ్పీ గర్ల్స్ ఉన్నత పాఠశాల ఎదురుగా గల అక్షర సుధా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని యోగా మాస్టర్, వై ఐ సి యోగా ఇన్స్ట్రక్చర్ మారాలా చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు, శ్లోకాలు, సామాజిక కుటుంబ విలువలు, ఆరోగ్య ఆహార అలవాట్లు, వ్యక్తిత్వ వికాసమును పెంపొందించుట లాంటివి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. యోగా సాధన తో ఆరోగ్యము, ఆరోగ్యంతో ఆనందము, ఆనందంతో ఆత్మవిశ్వాసము కలుగుతుందని తెలిపారు. ఆసక్తి అభిరుచి కలిగిన వారు సెల్ నెంబర్ 9700248575కు సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు