విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : జిల్లా ఎస్ పి పి.జగదీష్ ఆదేశాలతో నివాళులు అర్పించి మహనీయుల సేవలను స్మరించుకున్న పోలీసు అధికారులు
భారత జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చూపిన మార్గం సమాజానికి ఎల్లవేళలా ఆదర్శనీయమని అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొంది. గాంధీజీ, శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఆర్ ఐ పవన్ కుమార్ , తదితర అధికారులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింసలను ఆయుధాలుగా మలచుకుని గాంధీజీ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశానికి నూతన దిశానిర్దేశం చేసిన లాల్ బహుదూర్ శాస్త్రి సమర్థవంతమైన నాయకత్వం, నిరాడంబరత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు, సమాజ సేవకు పోలీస్ సిబ్బంది పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ఎస్ ఐ జాఫర్ , లక్ష్మినారాయణ, ఆర్ ఎస్ ఐ లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొని నాయకులకు నివాళులు అర్పించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
- Advertisement -


