Homeజిల్లాలుఅనంతపురంగ్రామీణ క్రికెట్ ప్రతిభకు ఆర్‌డిటి కొత్త ఊతం

గ్రామీణ క్రికెట్ ప్రతిభకు ఆర్‌డిటి కొత్త ఊతం

- Advertisement -

ఉరవకొండలో ప్రతిభాన్వేషణకు విశేష స్పందన.. 191 మంది యువ క్రికెటర్లు హాజరు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయికి తీర్చిదిద్దే లక్ష్యంతో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డిటి) నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉరవకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణకు విశేష స్పందన లభించింది. అండర్‌-15, అండర్‌-18 విభాగాల్లో నిర్వహించిన ఎంపికలకు మొత్తం 191 మంది యువ క్రికెటర్లు హాజరయ్యారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన క్రికెట్ శిక్షణ అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆర్‌డిటి క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఎంపికైన ప్రతిభావంతులకు శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయస్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్‌డిటి ఆర్‌డీ కృష్ణవేణి మాట్లాడుతూ యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రికెట్‌లో రాణించాలని కోరారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో 11 కేంద్రాల్లో ప్రతిభాన్వేషణ నిర్వహించామని, ఉరవకొండలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిటి కోఆర్డినేటర్ కె. ప్రవీణ్, హెడ్‌మాస్టర్ సత్యనారాయణ, సెలెక్టర్లు నరేంద్ర, విజయ్, ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌డిటి కోచ్‌లు ఇనాయతుల్లా, గోపి, పిఈటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు