Homeజిల్లాలుఅనంతపురంజర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీ
డిమాండ్లతో కూడిన వినతిపత్రం జాతిపిత మహాత్మకు సమర్పణ

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధానకార్యదర్శి షేక్ మహమ్మద్ అయూఫ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూ డబ్ల్యూజే ) ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నుంచి టవర్ క్లాక్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని, భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పునరుద్ధరణ చేయాలని, నూతన వేతన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి నివాస స్థలాలు ఇవ్వాలని. జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించా లని కోరారు. జర్నలిస్ట్ లకు ఆరోగ్య బీమా పాలసీని అమలు పరచాలన్నారు. వెటరన్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని. జర్నలిస్టులకు గతంలో ఉన్న విధంగా రైల్వేలో యాభై శాతం ప్రయాణ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు సనప రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పూల శెట్టి చలపతి, కే పి కుమార్, జిల్లా జాయింట్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ రెడ్డి, లోకరాజ్, అక్కులప్ప, నాగేంద్ర నాథ్ రెడ్డి, డేవిడ్, విశాలాంధ్ర మల్లికార్జున శర్మ, వార్త మల్లేష్, జిల్లా కోశాధికారి చాపిరి చౌడప్ప, భూమి రెడ్డి, వార్త వెంకట శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు