- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండల టీడీపీ అధ్యక్షులుగా బసలదొడ్డి గ్రామానికి చెందిన గవిగట్టు మల్లికార్జున నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టీడీపీ అధిష్టానం సోమవారం విడదల చేసింది. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ అధిష్టానం తనపై నమ్మకంతో టీడీపీ మండల అధ్యక్షులుగా ఎంపిక చేసిన టీడీపీ మంత్రాలయం ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డికి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డికి, టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.


