పుట్టపర్తి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం డివిజన్లో పోలీస్ శాఖ తప్పక అప్రమత్తంగా ఉండాలని పుట్టపర్తి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ హేమంత్ కుమార్ తోడివిజన్ పరిధిలోని నేరాల, వాటి కేసులు గూర్చి చర్చించారు. అనంతరం శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించాల్సిన అంశాలపై వారు చర్చించడం జరిగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, మహిళలపై నేరాలలో పాల్గొన్న 60 మంది నిందితులు మరియు లైంగిక నేరస్తులకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో నిందితులకు పోలీసు అధికారులు కఠినంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నారు. మహిళలపై ఎటువంటి రకమైన వేధింపులు, లైంగిక దాడులు, అఘాయిత్యాలు లేదా ఇతర నేరాలు జరిగితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోమహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని, ప్రతి మహిళ సురక్షితంగా ఉండే విధంగా 24 గంటల పర్యవేక్షణ, శక్తి టీం బృందాలు, ప్రత్యేక పట్రోలింగ్, ‘డయల్–100’ వంటి అత్యవసర సేవలు మరింత బలోపేతం చేయబడతాయని అధికారులు కృషి చేస్తారని తెలిపారు.
ఈ కౌన్సిలింగ్ కార్యక్రమానికి హాజరైన నిందితులకు మళ్లీ ఇలాంటి నేరాలలో పాల్గొంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహిళల రక్షణ, గౌరవం, భద్రత కోసం పోలీసులు అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని ప్రజలకు హామీ ఇచ్చారు. ధర్మవరం డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లో ఎస్పీ తో పాటు డీఎస్పీ కూడా పాల్గొన్నారు.
ధర్మవరం డివిజన్లో పోలీస్ శాఖ తప్పక అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
RELATED ARTICLES


