Sunday, December 7, 2025
Homeఆంధ్రప్రదేశ్సంఘమిత్ర లో గీతా జయంతి 

సంఘమిత్ర లో గీతా జయంతి 

- Advertisement -

విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.
వికాస తరంగాణి లో భాగంగా, చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బొబ్బిలి ఉషారాణి మరియు శ్రీ సాగరిక సమన్వయంతో చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని నీతి–మార్గదర్శక సూత్రాలను పిల్లలకు చేరువ చేయడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, విద్యా–సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సాగరికను శ్రీ సంఘమిత్ర డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు  చిరు సత్కారంతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు