Homeజాతీయంఇక ఒకే ఖాతాకు నలుగురు నామినీలు!

ఇక ఒకే ఖాతాకు నలుగురు నామినీలు!

- Advertisement -

బ్యాంకు ఖాతాదారులకు నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన శుభవార్త అందించింది. డిపాజిటర్ల సౌలభ్యం కోసం నామినీ నిబంధనలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకే బ్యాంకు ఖాతాకు గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది.ఈ సవరించిన నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఖాతాదారులు తమ డిపాజిట్లకు నలుగురి పేర్లను ఒకేసారి లేదా వేర్వేరు సమయాల్లో నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా, తమ తదనంతరం ఏ నామినీకి ఎంత మొత్తం లేదా ఎంత శాతం వాటా చెల్లించాలో కూడా స్పష్టంగా పేర్కొనే అవకాశం కల్పించారు. ఈ సౌకర్యం బ్యాంకు లాకర్లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పు వల్ల డిపాజిటర్ల మరణానంతరం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

చెక్కు క్లియరెన్స్‌లో సమస్యలు.. పెరిగిన డిజిటల్ లావాదేవీలు
ఇటీవల ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన తక్షణ చెక్కు క్లియరెన్స్ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అంగీకరించింది. అక్టోబర్ 4న ప్రారంభమైన ఈ కొత్త చెక్ ట్రంకేటెడ్ సిస్టమ్ (సీటీఎస్) ద్వారా చెక్కులు కొన్ని గంటల్లోనే క్లియర్ కావాల్సి ఉండగా, కొన్ని సందర్భాల్లో ఐదారు రోజుల సమయం పడుతోందని తెలిపింది. సిబ్బందికి శిక్షణ కొరత, సాంకేతిక లోపాలే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ సమస్యలను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీసీఐ వివరించింది.

మరోవైపు, దేశంలో డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం లావాదేవీల్లో 99.7 శాతం డిజిటల్ రూపంలోనే జరిగాయి. వీటి విలువ రూ.2,830 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో పేపర్ ఆధారిత చెక్కుల వాటా కేవలం 2.3 శాతానికి పడిపోయింది. యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి మాధ్యమాల ద్వారా చెల్లింపులు భారీగా పెరగడమే ఈ మార్పుకు కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు