Homeజిల్లాలువిజయనగరంరాజాంలో రద్దీ ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి విక్రయాలు

రాజాంలో రద్దీ ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి విక్రయాలు

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (.విజయనగరం జిల్లా) : రాజాం పట్టణ పరిధిలో ప్రధాన రహదారి, మాధవ బజార్ వంటి రద్దీ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై మందుగుండు సామాగ్రి (ఫైర్ క్రాకర్స్) ఉచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. రేపు నాగుల చవితి పండుగ కావడంతో పండుగ సరుకుల కోసం పట్టణానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ రద్దీ సమయంలో అగ్ని ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉన్నప్పటికీ, పట్టణంలోని కేంద్ర ప్రాంతాల్లోనే మందుగుండు వ్యాపారం కొనసాగుతుండటంపై స్థానికులు, బజార్లో ఉండేటువంటి ఇతర వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత వారం రోజుల క్రితం మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగిన ప్రమాద ఘటన ఇంకా ప్రజల మనసులో మిగిలి ఉండటంతో, రాజాంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మందుగుండు అమ్మకాలను పట్టణ చివర ప్రాంతాలకు తరలించి అక్కడే వ్యాపారం నిర్వహించేలా చూడాలని పలువురు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు