Wednesday, December 11, 2024
Homeజిల్లాలుప్రభుత్వం హామీల ఆర్బాటమేనా అమలు చేయరా

ప్రభుత్వం హామీల ఆర్బాటమేనా అమలు చేయరా

ప్రజల సమస్యలు పరిష్కరించాలి ………సిపిఎం

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి తహశీల్దారు కార్యాలయం ఎదుట గురువారం సిపిఎం పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆపార్టీ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తాహసిల్దార్ శ్రీధర్ మూర్తి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆర్బాటాలు చెప్పుకుంటూ కాలం ఎల్లబుచ్చుతూ ప్రజల సమస్యలను హామీలను కూటమి ప్రభుత్వం పోయిందన్నారు. ఈఏడాది ప్రకృతి వైఫల్యాల వల్ల అతివృష్టి అనావృష్టి రైతులకు పంటలు పండలేదని,అన్ని రంగాల్లో ప్రజలు నష్టపోయారన్నారు.పామిడి పట్టణంలో రోడ్లు విస్తీర్ణంలో పాలకులు అధికారులు అతి ఉత్సాహం చూపుతున్నారని, నిబంధనల ప్రకారం రోడ్డుకు ఇరువైపులా నిర్మించుకొన్న గృహ యజమానులకు నోటీసులు ఇవ్వకుండానే పెరికేయడం దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా వుందన్నారు. పట్టణ అభివృద్ధిలో బాగంగా విస్తీర్ణతను వద్దనడంలేదని,నిబంధనలు ప్రకారం నడుచుకోవాలన్నారు.రోడ్డు ప్రక్కన గృహ నిర్వాసితులకు ప్రత్యన్యాయంగా నివాస స్థలాలు చూపించాలని,అలాగే విద్యుత్ ట్రూఆఫ్ చార్జీలు ప్రభుత్వమే భరించాలని, ఉచిత ఇసుకను తక్షణమే అమలు చేయాలని, నిత్యవసర ధరలు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు పరచాలని, జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల కోసం 7వేల కోట్లు నిధులను కేటాయించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీీకరణ,ఉద్యోగుల తొలగింపు ఆపాలని, మహిళలు, మైనారిటీలు దళితులపై దాడులు అత్యాచారాలను అరికట్టాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి,ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నారు.అలాగే రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసే జమిలీ ఎన్నికల ప్రతిపాదనలు విరమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనిమిరెడ్డి, మల్లేషు, ముత్యాలు, చంద్రమోహన్ రెడ్డి, శంకర్, రామయ్య,చంద్రకళ, నాగమ్మ, లక్ష్మీదేవి, జ్యోతి, ఆలీబాబా, క్రిష్ణారెడ్డి, లలితమ్మ, రంగారెడ్డి, పాలాక్షి, యోగి, అమర, శర్మాష్, బాలన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు