Homeఆంధ్రప్రదేశ్ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : దళారీ వ్యవస్థను రూపుమాపటానికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రైతులు సద్విని చేసుకోవాలని గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు పేర్కొన్నారు దేవరపల్లి మండలం ఎర్నగూడెం రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు ఎర్నగూడెం సొసైటీ అధ్యక్షుడు పెనుమత్స సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన సభలో బ్రహ్మరాజు మాట్లాడుతూ రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటలలో వారి ఖాతాలకు సొమ్ము జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రైతులు తేమశాతం 17 ఉండే విధంగా చూచుకోవాలని ఆయన తెలిపారు కొవ్వూరు ఏ డి ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు పండించే ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోని అమ్ముకోవాలని పేర్కొన్నారు దేవరపల్లి మండలం వ్యవసాయ అధికారి కే కమలరాజు మాట్లాడుతూ తుఫాను వలన ధాన్యం కొంతమేర తెలిసినా ఆరబెట్టుకుని అమ్ముకోవాలని అన్నారు సర్వీస్ రోడ్లో ధాన్యం ఎండబెట్టే రైతులు ధాన్యం తీసిన వెంటనే రాళ్ళను తీసివేయాలని ఆయనకు వరారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో పండించే ధాన్యాన్ని రైతులు వినియోగించడం లేదని కేవలం అమ్ముకోవటానికే చూస్తున్నారు అన్నారు మన పండించే ధాన్యాన్ని 92 శాతం ఎగుమతి అవుతుందని అన్నారు ఎర్నగూడెం సొసైటీ అధ్యక్షుడు పెనుమత్స సుబ్బరాజు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాలు 23 75 రూపాయలు రేటు ఉంటుందని ఆయన తెలిపారు రైతులందరూ విధిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని పంట నమ్ముకోవాలని ఆయన సూచించారు దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావు త్యాజంపూడి సొసైటీ అధ్యక్షుడు కోడూరు వెంకటరత్నం ఎర్నగూడెం సొసైటీ కార్యదర్శి మండ పెద్దబాబు తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజును కొవ్వూరు ఏడిఏ శ్రీనివాసులు దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావును దేవరపల్లి మండల వ్యవసాయ అధికారి కే కమల రాజును ఎర్నగూడెం సొసైటీ అధ్యక్షుడు పెనుమత్స సుబ్బరాజు సొసైటీ సీఈవో మండ పెద్దబాబు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బుల్లిన విజయభాస్కర్ మండ సుబ్బారావు సొసైటీ డైరెక్టర్ పొట్ట హరిప్రసాద్ సిబ్బంది పి బాలాజీ కిరణ్ కిరణ్ పి ప్రశాంతి దుర్గారావు గిరి రైతులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు