విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో శనివారం నాడు తుఫాను వలన దెబ్బతిన్న వరి పంట పొలాలు శాస్త్రవేత్తల బృందంపరిశీలించారు ఈ సందర్భంగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర పాలడుగుల సత్యనారాయణ మాట్లాడుతూ తుఫాను వలన ఉభయగోదావరి జిల్లాలు కృష్ణాజిల్లా డెల్టా ప్రాంతం వరి ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు పంట నష్టం అంచనా వేయటానికి రాష్ట్రంలో వివిధ బృందాలు పర్యటిస్తున్నాయని అన్నారు 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టం జరిగితే ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం అందుతుందని ఆయన తెలిపారు ఈ ప్రాంతంలో 70 శాతం పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారం త్వరలోనే అందుతుందని ఆయన తెలిపారు తుఫాను వలన నేల కూలిన వరి పంటను రక్షించుకోవటానికి నాలుగు పద్ధతులు ఉన్నాయని వాటిలో ముఖ్యంగా పంటపొలాలలో వర్షపు నీటిని బయటకు తీసే ప్రయత్నం చేయాలని ఇదేవిధంగా దెబ్బతిన్న పంటను నిలదీయాలని పడిపోయిన వరి పంటపై ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచ్చికారి చేసుకోవాలని సూచించారు ఆర్గానిక్ సేంద్రియకర్భణం 03% నుండి 0 7 శాతానికి పెంచుకోవాలని సత్యనారాయణ సూచించారు వరి కోసిన తర్వాత గడ్డిని కాల్చకుండా చేలో కలియుదున్నాలని దీనివలన భూసారం పెరుగుతుందని తెలిపారు ఓరి నాట్లు వేసే సమయాలను రైతులు గుర్తించి నవంబర్ 15 నాటికి కోత వచ్చే విధంగా నాట్లు వేసుకోవాలని దాల్వా వరి నవంబర్ 15 నుండి మార్చి 15వ తేదీ వరకు పంటకు వచ్చే విధంగా నాట్లు వేసుకోవాలని సూచించారు దీనివలన మూడో పంటకు పెసర వేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు ప్రతి రైతు భూసారాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువు ఎర్నగూడెం చేరుకున్న డాక్టర్ పాదడుగుల సత్యనారాయణ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసరావు అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎం శ్రీనివాస్‌లకు దేవరపల్లి మండల వ్యవసాయ అధికారి కె కమల్ రాజు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలోదేవరపల్లి మండల వ్యవసాయాధికారి కే కమలరాజు తాసిల్దార్ ఎం శ్రీనివాస్ వ్యవసాయ అసిస్టెంట్ సంజన ప్రకృతి వ్యవసాయ గోపాలపురం డివిజన్ సోము శెట్టి శ్రీనివాస్ సొసైటీ కార్యదర్శి చల్ల మల్ల సత్యనారాయణ బొల్లిన విజయ భాస్కర్ ఎస్ సత్యనారాయణ నరహరిశెట్టి రాజేంద్ర బాబు మండ సుబ్బారావు సొసైటీ కార్యదర్శి మండ పెదబాబుపాలూరి బాలాజీ పకృతి వ్యవసాయ సిబ్బంది సూర్య లక్ష్మి ప్రకాష్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
పంట పొలాలు-శాస్త్రవేత్తల బృందం
- Advertisement -
RELATED ARTICLES


