విశాలాంధ్ర – కడియం : రైతుల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సహకార సంఘాల ద్వారా కొత్త పాలకవర్గాలు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం లోని వేమగిరి, కడియం, మురమండ, కడియపులంక గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేమగిరి త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, కడియం త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా వెలుగుబంటి రఘురాం (నాని), మురమండ త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా వట్టికూటి జానకి రామయ్య (దత్తుడు) అదేవిధంగా కడియపులంక త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా గట్టి నరసయ్య లతో ఎమ్మెల్యే గోరంట్ల ప్రమాణ స్వీకారాలు చేయించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పలు సహకార సంఘాలు నష్టాల బారిన పడ్డాయన్నారు. కొత్త పాలకవర్గాలు సహకార సంఘాలను అభివృద్ధి దిశగా నడిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని వాటిని రైతులకు సక్రమంగా అందించే విధంగా పాలకవర్గాలు కృషి చేయాలన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా కడియం మండలంలో త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు
- Advertisement -
RELATED ARTICLES


