- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక అంబేద్కర్ నగర్ నందు 119, 120 బూత్ల పరిధిలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సౌకర్యంగా వారి గృహాల వద్దకే సేవలు అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కాజా, ఉల్లిగప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీనుగా వరప్రసాద్, రవి వర్మ, టి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.


