Sunday, December 7, 2025
Homeజిల్లాలుకర్నూలుహెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

- Advertisement -

* గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ సభ్యులు గురువారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న ( చిన్న ఉరుకుందు), గ్రామ ఉపాధ్యక్షులుగా నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సత్యన్న, బోయ సురేష్, బోయ వీరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే గ్రామ కార్యదర్శులుగా బోయ ఉసేని, మజ్జిగ దస్తగిరి, శ్రీనివాసులు, గ్రామ కోశాధికారిగా ఊబగడ్డల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్నను గజమాలతో సన్మానించి గ్రామ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీడీపీ గ్రామ అధ్యక్షులు సొంటెన్న మాట్లాడుతూ హెచ్. మురవణి గ్రామంలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు