Sunday, December 7, 2025
Homeజిల్లాలుఅనంతపురం19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ

19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ను షెడ్యూల్ కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. ఈనెల 19వ తేదీన నగరంలోని కలెక్టరేట్ నుంచి పీఎస్కే మ్యూజియం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించాలని, ఈనెల 20వ తేదీన పిఎస్కే మ్యూజియంలో కాయిన్స్ అండ్ స్టాంప్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. 21వ తేదీన పద్య పటన పోటీలు, 22వ తేదీన వ్యాసరచనతో పోస్టర్ తయారీ, 23వ తేదీన మినియేచర్ ఆర్టి క్రాఫ్ట్, 24వ తేదీన జిల్లా సంప్రదాయ వంటకాలను అనంతపురం పిఎస్కే మ్యూజియంలో, 25వ తేదీన కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయం చేసుకొని పనిచేసి వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ను విజయవంతం చేయాలని ఆదేశించారు. గైడ్స్ ఏర్పాటు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎటర్నల్ అనంత పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్కియాలజీ ఏడి స్వామి నాయక్, డీఈవో ప్రసాద్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఈఈ షాకీర్, జిల్లా టూరిజం శాఖ అధికారి జయకుమార్ బాబు, లేడీస్ క్లబ్ సెక్రెటరీ పద్మనాభరెడ్డి, డిఐపిఆర్ఓ బాలకొండయ్య, ఇంటాక్ మెంబర్లు జూటూరు షరీఫ్ రియాజుద్దీన్, ట్రాఫిక్ సిఐ వెంకటేష్ నాయక్, డిస్కవరి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు