- Advertisement -
ప్రిన్సిపాల్ వనితా వాణి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు దాత ప్రముఖ సన్ ఫీస్ట్ కంపెనీ ప్రతినిధి కె. సూర్య నారాయణ 15 కుర్చీలను తన వంతు సాయం గా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి కి అందజేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల అభివృద్ధి కమిటీ తరుపున బండి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ వనితా వాణి, అధ్యాపక సిబ్బంది సునీత, మునుస్వామి నాయుడు తదితరులు దాత కు కృతజ్ఞతలు తెలియజేశారు.బాలికలు అందరూ బాగా చదువుకుని ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు మంచి పేరు తేవాలని దాత సూర్య నారాయణ తెలిపారు.


