Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు

కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరిగింది. హెచ్డిఎఫ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ కురాష్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సుమన మాట్లాడుతూ ఇందులో జివి ఈ జెడ్పి గర్ల్స్ స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి.సింధు అండర్ 14 మైనస్ 32 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచిందని, తదుపరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. అనంతరం డిసెంబర్ 15వ తేదీ నుంచి 17 వరకు నిర్వహించే తేదీలలో జాతీయస్థాయి కులాష్ లో ఎంపిక కావడం చాలా సంతోషకరమని వారు తెలిపారు. అనంతరం ఆ విద్యార్థినిని హెడ్మాస్టర్ సుమనతో పాటు ఉపాధ్యాయ బృందం, పిఈటి స్వరూప, సరళ, విద్యార్థి హిందువులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఈ శిక్షణ ఇచ్చిన కోచ్ భాషాను ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు